కాపు, బలిజలను జగన్ రాజకీయంగా అణచివేస్తున్నారు: అనగాని సత్యప్రసాద్

09-02-2024 Fri 10:41 | Andhra
Advertisement
  • జగన్ కులపిచ్చి పరాకాష్ఠకు చేరిందన్న అనగాని
  • మూడు రాజ్యసభ సీట్లలో రెండు రెడ్లకు ఇచ్చారని మండిపాటు
  • జగన్ చెపుతున్న సామాజిక న్యాయం ఇదేనా? అని ప్రశ్న
Advertisement
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విమర్శలు గుప్పించారు. జగన్ కులపిచ్చి పరాకాష్ఠకు చేరిందని... కాపులు, బలిజ సామాజికవర్గాన్ని రాజకీయంగా అణచి వేస్తున్నారని మండిపడ్డారు. జగన్ కు రాష్ట్ర ప్రయోజనాల కంటే... ఆయన సామాజికవర్గమే ఎక్కువని విమర్శించారు. తాజాగా మూడు రాజ్యసభ సీట్లలో రెండింటిని రెడ్డి సామాజికవర్గానికే ఇచ్చారని దుయ్యబట్టారు. జగన్ చెపుతున్న సామాజిక న్యాయం ఇదేనా? అని ఎద్దేవా చేశారు. ఈరోజు అమరావతిలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

రాయలసీమలో ప్రధానమైన బలిజ సామాజికవర్గానికి చెందిన చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ కు రాజ్యసభ సీటును ఇస్తున్నట్టు తొలుత జగన్ ప్రకటించారని అనగాని తెలిపారు. ఆ తర్వాత ఆయనను తొలగించి సొంత సామాజికవర్గానికి చెందిన మేడా రఘునాథరెడ్డికి కేటాయించారని మండిపడ్డారు. ఇది బలిజల గొంతు కోయడం కాదా? అని ప్రశ్నించారు. నమ్మించి గొంతులు కోయడం జగన్ జీన్స్ లోనే ఉందని అన్నారు. బలహీనవర్గాలంటే జగన్ కు చిన్నచూపు అని దుయ్యబట్టారు.
Advertisement
Anagani PrasadTelugudesamJaganYSRCPKapuAP Politics

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more